Departments

Departments - TELUGU - Course Outcomes

అభ్యసన ఫలితాలు

B.A., B.Com, మరియు B.Sc.లలో తెలుగు నేర్చుకోవడం విజయవంతంగా ముగించాక, విద్యార్థులు క్రింది అభ్యసన ఫలితాలను పొందగలరు.

SEM-I మరియు SEM-II

  • ప్రాచీన తెలుగుసాహిత్యం యొక్క ప్రాచీనతను, విశిష్టతను గుర్తిస్తారు. తెలుగు సాహిత్యంలో ఆదికవి నన్నయ కాలంనాటి భాషసంస్కృతులను, ఇతిహాస కాలంనాటి రాజనీతి విషయాల పట్ల పరిఙ్ఞానాన్ని సంపాదించగలరు.
  • శివకవుల కాలంనాటి మతపరిస్థితుల్ను, భాషావిశేషాలను గ్రహిస్తారు. తెలుగు నుడికారం, సామెతలు, లోకోక్తులు మొదలైన భాషాంశాల పట్ల పరిఙ్ఞానాన్ని పొందగలరు.
  • పదాల విభజన, పదబంధాలు, వాక్యాల నిర్మాణం మరియు భాష యొక్క నిర్మాణం గురించి నేర్చుకుంటారు.
  • B.A., B.Com, మరియు B.Sc.లలో తెలుగు నేర్చుకోవడం వల్ల విద్యార్థులు ప్రాచీన మరియు ఆధునిక సాహిత్యం రెండింటినీ నేర్చుకునే అవకాశం లభిస్తుంది, ఇది సౌందర్య భావాలను మరియు నైతిక విలువలను పెంపొందించడానికి మరియు భవిష్యత్తు కోసం వారిని సిద్ధం చేయడానికి సహాయపడుతుంది.

SEM-III మరియు SEM- IV

  • విద్యార్థులు నాయకత్వ లక్షణాలను పెంపొందించుకుంటారు మరియు ఇది విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి సహాయపడుతుంది.
  • విద్యార్థులు కవిత్వంలో నైతిక, మానవీయ విలువలను తెలుసుకుంటారు.
  • తెలుగు సాహిత్యాన్ని అధ్యయనం చేయడం వలన మానసిక వికాసంతో పాటు వ్యక్తిత్వ వికాసం కూడా కలుగుతుంది.
  • సహజకవి పోతన గారి కవితామాధుర్యాన్ని, ఆంధ్ర మహాభాగవతంలోని శ్రీ మహా విష్ణువు దశావతారాలను తెలుసుకుంటారు.
  • గతంలో నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ ప్రాంత రచయితల గురించి విద్యార్థులకు అవగాహన కలుగుతుంది.

SEM- V మరియు SEM- VI

  • తెలుగు సాహిత్య అభ్యసన ద్వారా నేర్చుకున్న నైపుణ్యాలను, సృజనాత్మక నైపుణ్యాలుగా మార్చుకోగలరు.
  • విద్యార్థులు భాషాతత్వాన్ని, భాష యొక్క ఆవశ్యకతను, భాష యొక్క ప్రాధాన్యాన్ని గుర్తిస్తారు. మనిషి వ్యక్తిగత జీవనానికి, సామాజికవ్యవస్థ పటిష్టతకు భాష ప్రధానమని తెలుసుకుంటారు. తెలుగుభాషలోని కీలకాంశాలైన ‘వర్ణం-పదం-వాక్యాల’ ప్రాధాన్యాన్ని గుర్తిస్తూ, వాగ్రూప- లిఖితరూప వ్యక్తీకరణ ద్వారా భాషానైపుణ్యాలను మెరుగుపరచుకోగలరు.
  • భాషానైపుణ్యాలను అలవరచుకోవడంతోపాటు వినియోగించడం నేర్చుకుంటారు. రచనా, భాషణానైపుణ్యాలను సృజనాత్మక రూపంలో వ్యక్తీకరించగలరు.
  • ప్రాచీన పద్యరచనతో పాటు ఆధునిక కవిత, కథ, వ్యాసం, మొదలైన సాహిత్యప్రక్రియల నిర్మాణాలకు సంబంధించిన సిద్ధాంత విషయాలను నేర్పడంతో పాటు వారిలో రచనా నైపుణ్యాలను పెంపొందించుకోగలరు.
  • సృజన రంగం, ప్రసార మాధ్యమ రంగాల్లో ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోగలరు.
  • అనువాద రంగంలో నైపుణ్యం సంపాదించగలరు.
  • ఆంగ్లభాష ప్రభావం కారణంగా తెలుగులో వచ్చిన ఆధునిక సాహిత్యాన్ని, దాని విశిష్టతను గుర్తిస్తారు.
  • సమకాలీన ఆధునిక సాహిత్య ప్రక్రియలైన “వచన కవిత్వం, కథ, నవల, నాటకం, విమర్శ”లపై అవగాహన పొందుతారు.
  • భావకవిత, అభ్యుదయ కవితా లక్ష్యాలను గూర్చిన జ్ఞానాన్ని పొందుతారు. అస్తిత్వవాద ఉద్యమాల పుట్టుకను, వాటి ఆవశ్యకతను గుర్తిస్తారు.
  • కథాసాహిత్యం ద్వారా సామాజిక చైతన్యాన్ని పొందుతారు. సిద్ధాంతాల ద్వారా కాకుండా, వాస్తవ పరిస్థితులను తెలుసుకోవడం ద్వారా సిద్ధాంతాన్ని సమీక్షించగలరు.

ఆధునిక తెలుగు కల్పనా సాహిత్యం ద్వారా సామాజిక, సాంస్కృతిక, రాజకీయ చైతన్యాన్ని పొందుతారు.