Departments

Departments - Telugu

Department of Telugu:

Name of the Fcaulty:

1. Dr.D.Ramanamma

2. V.Rajeshwari

3.Ch.Annapurna 

4.J.Vanisree 

 

జాతీయ స్థాయి కథల  పోటీ

డి. ఆర్. జీ.డిగ్రీ ప్రభుత్వ కళాశాల

 తాడేపల్లిగూడెం,పశ్చిమ గోదావరి  వారు నిర్వహించిన జాతీయస్థాయి ఉత్తమ కథల పోటీలో మా కళాశాల విద్యార్థిని కె.అభినయ  రాసిన "మానవతా విలువలు" అనే కథకు తృతీయ  బహుమతి లభించింది. విద్యార్ధినిని ఆర్.సి.ఓ. గారు,కళాశాల ప్రిన్సిపల్ మరియు తెలుగు అధ్యాపక బృందం అభినందించారు . విద్యార్థినికి నగదు బహుమతిగా  రూ.1000/_మరియు ప్రశంసాపత్రం అందజేశారు.

కళాశాల స్థాయిలో నిర్వహించిన కవితల పోటీలో  ఎంపికైన  ఉత్తమ కవిత.

అమ్మ!

నా తొలి పరిచయం

ఈ లోకం అంటే ఏంటో తెలియని నాకు ఒక కొత్త జన్మనిచ్చావు

నీ కడుపులో నేనున్నానని తెలిసిన మరుక్షణం నుండి ప్రతీక్షణం ఓ కొత్త ప్రేమను చూపావు.

ఎన్ని కష్టాలొచ్చిన ఓర్పుతో సహనంతో అన్ని నా కోసం భరించావు.

నేను పలికిన  తొలిపదం నువ్వు.

నేను ఎదుగుతున్నకొద్ది ఎందరు నిందించిన నాకు ధైర్యంగా నిలిచావు.

ఈ లోకం  మనుగడలో ఎన్నో అఘాయిత్యాలు జరుగుచున్న కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చావు.

నవమాసాలే కాదు జీవితాంతం మోస్తున్నావు

యింత ప్రేమను పంచిన నీకు ఇంకోజన్మంటు ఉంటే  తల్లిగా పుడతాను అమ్మ.

 

                  బి.అఖిల

                ఐ.ఎం.ఎస్.సి

తెలంగాణా  భాషా దినోత్సవం-కాళోజి జయంతి

పుట్టుక-చావు కాకుండా బ్రతుకంతా తెలంగాణాకు ఇచ్చిన మహానీయుడు-వైతాళికుడు కాళోజి జయంతిని తెలంగాణా భాషా దినోత్సవంగా కళాశాలలో ఘనంగా నిర్వహించాము.ఇందులో భాగంగా విద్యార్థినిలకు వ్యాస రచన, వక్తృత్వ పోటీలను నిర్వహించాము.విద్యార్థినిలు తెలంగాణ భాషా ఔన్నత్యం, నుడికారాలు వాటి ఉపయోగం,ప్రయోగం,ప్రాముఖ్యతను మరియు కాళోజి జీవిత విశేషాలను వివరిస్తూ కాళోజి బ్రతుకంతా తెలంగాణా సాహిత్య,సాంస్కృతిక,సామాజిక ఉద్యమాలన్నింటితో ముడిపడి వున్నదని వారిని ఉదాహరించకుండా తెలంగాణా సామాజిక చరిత్ర ఉండదని తెలిపారు. ఈకార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపక బృందం మరియు విద్యార్థినిలు పాల్గొని కాళోజి చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.