Departments - Telugu - Departmental Activities
ఆగస్టు 6వ,తేదీ ఆచార్య జయ శంకర్ జయంతిని కళాశాలలో జరుపుకున్నాము.
జయశంకర్ గారి జీవితం మరియు ఉద్యమ స్ఫూర్తిని విద్యార్థులకు తెలియజేశాము.
తెలంగాణ సాధనలో జయ శంకర్ గారి పాత్ర గురించి తెలిపాము.
ఆగస్టు 29వ, తేదీ
గిడుగు రామమూర్తి పంతులు గారి జయంతి ని తెలుగు భాషా దినోత్సవం గా జరుపుకుంటాము.
వ్యవహార భాషోద్యమ కర్త గిడుగు రామమూర్తి పంతులు గారు.
సెప్టెంబరు 9వ, తేదీ కాళోజి జయంతి ని పురస్కరించుకుని తెలంగాణ భాషా దినోత్సవం గా జరుపుకుంటాము.
కాళోజి ఉద్యమ స్ఫూర్తి ని విద్యార్థులకు తెలియజేశాము.తెలంగాణ భాష మరియు యాస గురించి వివరించాము.కళాశాల పర్యటనలో భాగంగా విచ్చేసిన గురుకులం అడిషనల్ సెక్రటరీ మాధవి లత మేడం గారు హాజరయ్యారు.
క్షేత్ర పర్యటనలో భాగంగా డిగ్రీ తృతీయ సంవత్సరం విద్యార్థులను షాద్ నగర్ సమీపంలోని ప్రాచీన మైన ఎంతో పేరు ప్రఖ్యాతి గాంచిన శ్రీ వీరాంజనేయ స్వామి, సీతా రాములు,బాబా ,శివ పార్వతుల ఆలయానికి తీసుకెళ్లాము.విద్యార్థులు ఆలయ చరిత్ర గురించి తెలుసుకొని ఆధ్యాత్మిక భావంతో ఆహ్లాదముగా గడిపారు.
తెలంగాణ ఉద్యమ వీర వనిత,
తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీరమాత మన చాకలి ఐలమ్మ జీవితం గురించి ,ఆమె పోరాట పటిమ గురించి విద్యార్థులకు తెలియజేశాము. ఆమె జీవిత విశేషాల మీద విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించాము.హైదరాబాద్ లోని కోఠి మహిళా విశ్వవిద్యాలయానికి తెలంగాణ ప్రభుత్వం వీరనారి చాకలి ఐలమ్మ విశ్వవిద్యాలయం గా నిర్ణయించింది.
విద్యార్థులకు పాఠ్య పుస్తకం లో ఉన్న "రైతు ప్రశస్తి" పాఠ్య బోధనలో భాగంగా విద్యార్థులను వ్యవసాయ క్షేత్రానికి తీసుకెళ్లి రైతు గొప్పతనం గురించి,పంట సాగు విధి విధానాల గురించి తెలిపాము.విద్యార్థులు ఆసక్తిగా పాల్గొన్నారు.
జనవరి 3వ, తేది సావిత్రి బాయి పూలే గారి జయంతిని జరుపుకున్నాము. ఆమె జయంతిని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం ఈ సంవత్సరం మహిళా ఉపాధ్యాయ దినోత్సవం గా జనవరి 3వ,తేదీని ప్రకటించింది.ఆమె ఎదుర్కొన్న అవమానాలు,అయినా వెనకడుగు వేయకుండా ముందుకెళ్లిన ఆమె ధైర్యాన్ని విద్యార్థులకు తెలిపాము.ప్రమీదలో చమురు వలే తాను సమాజానికి అందించిన కాంతి గురించి వివరించాము.
సరస్వతి దేవి ని మాఘ పంచమి రోజు వసంత పంచమి , శ్రీ పంచమి అని అమ్మవారిని ఆరాధిస్తాము. విద్యార్థులకు జ్ఞానాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ వసంత పంచమి వేడుక విద్యార్థులతో కలిసి జరుపుకున్నాము.
11/02/2021 రోజున తెలుగు విభాగం వారి ఆధ్వర్యంలో శ్రీకాకునూరి సూర్యనారాయణ మూర్తి గారిని విద్యార్థులకు "తెలుగు పాఠ్యాంశాలతో వ్యక్తిత్వ వికాసం" అనే అంశంపై ఉపన్యాసం ఇవ్వవలసిందిగా ఆహ్వానించాము.
గురువుగారు తెలుగు పాఠ్యాంశాలలోనే జీవన విధానం ఉందని జీవించడం, జీవనాన్ని సుమార్గంలో నడిపించే విధంగా పిల్లలు తల్లిదండ్రులతో ఏవిధంగా ఉండాలి, ఎలాంటి అలవాట్లను అలవర్చుకోవాలి, కష్టపడితే సాధ్యం కానిది ఏమీ లేదని సాధకుడు చేసే పని యందు సుఖదుఃఖలను పరిగణించడని పెద్దలపట్ల గౌరవ మర్యాదలు కలిగి ఉండాలని సమాజంలో తోటి మానవుల పట్ల ఏ విధంగా ప్రవర్తించాలో, మానవులకు మూగజీవాలకు మధ్య ఉండే ఆప్యాయతను ఇలా ప్రతి పాఠ్యాంశాన్ని మానవ జీవితంతో సమన్వయిస్తూ విద్యార్థులకు అర్థమయ్యే విధంగా చక్కగా వివరించడం జరిగింది.
డి. సంధ్య బీకాం మొదటి సంవత్సరం విద్యార్థిని గంగిరెద్దు అనే పాఠ్యాంశం బోధించడం జరిగింది.
డాక్టర్ పల్లా దుర్గయ్య రచించిన గంగిరెద్దు పాఠ్యాంశంలోని సారాంశము: ఇంతకుముందు ఎవరు రాయని సరికొత్త వస్తువును స్వీకరించి హృద్యమైన పదాలతో పల్లా దుర్గయ్య గంగిరెద్దు కావ్యం రచించాడు.
ఒక ఆవుకు అవలక్షణాలతో కూడిన కోడె పుడుతుంది. కొంతకాలానికి కోడె దూడ తల్లి చనిపోతుంది. కోడె ఆ యజమాని ఇంటి నుండి పారిపోతుంది. ఒక గంగిరెద్దుల వాడు ఆ కోడేని తన ఆధీనంలోకి తీసుకుని రకరకాల విద్యలు నేర్పి ఊరూరా తిప్పుతూ దానిపై ఆధారపడి జీవిస్తుంటాడు. గంగిరెద్దుల వాడు ఆ గంగిరెద్దును అలంకరించిన తీరు, దానితో చేయించిన విన్యాసాలు, విద్యలు ప్రదర్శింప చేసిన పద్ధతులు ,కళా ప్రదర్శన అనంతరం ప్రేక్షకుల నుండి తనకు, గంగిరెద్దుకు కానుకలు అర్పించిన విధము హృద్యంగా వర్ణించబడింది. అంతరించిపోతున్న ఒక వృత్తి కళా వైభవ సౌందర్యం, ప్రకృతిలో ఇతర జీవులపై ఆధారపడే మనుషులు, సహజీవన సంస్కృతి, జీవకారుణ్య అంశాలు చక్కగా విద్యార్థులు తెలుసుకున్నారు.
దివ్య బిఏ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని "సంవరుణుడి తపస్సు" అనే పాఠ్యాంశం బోధించడం జరిగింది.
సంవరణుడి తపస్సు : అద్దంకి గంగాధరుడు రచించిన తపతి సంవరణోపాఖ్యానం ద్వితీయాశ్వాసం నుండి గ్రహింపబడింది. సూర్యుని కుమార్తె తపతి. హస్తినాపుర పాలకుడు సంవరణుడు. తపతిని ఇష్టపడ్డ సంవర్ణుడు సూర్యుని మెప్పించి పెళ్లి చేసుకోవడం కోసం తపస్సు చేస్తాడు.
సంవరణుడు తన తపస్సుతో సూర్యదేవుడిని ప్రసన్నం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. అతని అచంచల తపస్సుకు సంతృప్తిచెందిన సూర్యభగవానుడు ప్రత్యక్షమై, "నీ కోరిక చెప్పు, తపస్సుతో నన్ను ప్రసన్నం చేసుకున్నావు" అని అన్నారు.
ఈ కథలో భక్తి, పట్టుదల, తపస్సు శక్తి, గురువుల ఆశీర్వాదం, మరియు ధర్మపాలన ప్రధానాంశాలుగా కనిపిస్తాయి. ఇక్కడ తపస్సు ద్వారా దేవతల అనుగ్రహాన్ని పొందే శక్తి ఉన్నదని, గురువుల మార్గదర్శనం ఉంటే ఏ విజయమైనా సాధించవచ్చని తెలియజేస్తుంది.
కే. మౌనిక బీకాం మొదటి సంవత్సరం విద్యార్థిని "శకుంతలోపాఖ్యాన" అనే పాఠ్యాంశం బోధించడం జరిగింది.
శకుంతలోపాఖ్యానం కథ సారాంశం:
దుష్యంత మహారాజు, శకుంతల అనే అప్సరకన్యను అడవిలో కలుస్తాడు. ఇద్దరూ ప్రేమలో పడతారు మరియు గంధర్వ వివాహం చేసుకుంటారు. దుష్యంతుడు రాజధానికి తిరిగి వెళ్లే ముందు, శకుంతలకి గుర్తుగా ఉంగరం ఇస్తాడు. అయితే, శకుంతలను శాపవశాత్తూ రాజు మరచిపోతాడు.
ఒకసారి ఉంగరం కోల్పోయిన శకుంతల దుష్యంతుని దగ్గరకు వెళ్తుంది, కానీ అతడు ఆమెను గుర్తు పట్టలేడు. చివరికి, ఉంగరం తిరిగి లభించి, శాప ప్రభావం తొలగిపోతుంది. దుష్యంతుడు తన తప్పును గ్రహించి, శకుంతలతో తిరిగి కలుసుకుని ఆమె కుమారుడు భరతుడిని తన వారసుడిగా అంగీకరిస్తాడు.
ఈ కథ ప్రేమ, శాపం, పరిష్కారం, ధర్మం వంటి విలువలను అందంగా ప్రతిబింబిస్తుంది. అని విద్యార్థిని తన మాటల్లో చక్కగా వివరించింది .
బీకాం మొదటి సంవత్సరం విద్యార్థినులను రెండు గ్రూపులుగా విభజించి వారిద్దరి మధ్య "లింగ వివక్ష " అనే అంశంపై చర్చ నిర్వహించడం జరిగింది.
లింగ వివక్షత అనే అంశం ద్వారా విద్యార్థులు
* అన్ని లింగాలు సమానమని, అందరికీ సమాన హక్కులు, అవకాశాలు ఉండాలని అవగాహన కల్పించాము.
* ప్రతి వ్యక్తిని వారి లింగం ఆధారంగా కాకుండా, ఒక మనిషిగా గౌరవించడం ముఖ్యమని గుర్తిస్తారు.
* లింగ వివక్షత అనేది అన్యాయం అని, అందరికీ సమాన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మన అందరిదని తెలుసుకున్నారు.
*వివక్షతో బాధపడే వ్యక్తుల పరిస్థితిని అర్థం చేసుకోవడం, వారికి మద్దతు ఇవ్వడం నేర్చుకుంటారు.
*లింగ వివక్షతను సమాజంలో తగ్గించడానికి, సమానత్వం కోసం కృషి చేయాలనే సామాజిక బాధ్యతను గ్రహిస్తారు.
*లింగ వివక్షత సమాజంలో ఎదురైనప్పుడు దానికి విరుద్ధంగా నిలబడటానికి ధైర్యం పెరుగుతుంది.
ఈ పాఠాలు విద్యార్థుల్లో సానుకూల భావజాలాన్ని పెంపొందించడమే కాక, సమానతతో కూడిన సమాజాన్ని నిర్మించడంలో కూడా సహాయపడతాయి అని తెలుసుకున్నారు.