Departments

Departments - TELUGU - Activities

తెలుగు భాషా దినోత్సవ వేడుకలు:  (ఆగస్టు 29)

  • వ్యావహారిక భాషోద్యమ నాయకుడు గిడుగు రామ్మూర్తి జయంతిని తెలుగు భాషాదినోత్సవంగా జరుపుకోవడం పరిపాటి.
  • మా కళాశాలలో తెలుగుభాషా దినోత్సవ వేడుకలు ప్రతి సంవత్సరం ఘనంగా జరుగుతాయి.
  • మా కళాశాలలో తెలుగుభాషా దినోత్సవం ఎంతో ఆనందంగా జరుపుకుంటాము.
  • తెలుగు అధ్యా పకులు, తెలుగు భాష గొప్పతనం మరియు గిడుగు రామ్మూర్తి గారి గొప్పతనం గురించి వివరించడం జరుగుతుంది.
  • మా కళాశాల ప్రిన్సిపాల్ గారు కూడా తెలుగుభాషా దినోత్సవం పురస్కరించుకొని తెలుగు గురించి ఎంతో చక్కగా వివరిస్తారు.
  • అలాగే కొంతమంది విద్యార్థులు కూడా తెలుగుభాషా దినోత్సవం సందర్భంగా ఉపన్యాసం ఇస్తారు.

ఉపాధ్యాయుల దినోత్సవం (సెప్టెంబర్ 5)

  • పాధ్యాయుల దినోత్సవం భారతదేశంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం సెప్టెంబరు 5 జరుపుకుంటారు.
  • మా కళాశాలలో ఉపాధ్యాయుల దినోత్సవ వేడుకలు ప్రతి సంవత్సరం ఘనంగా జరుగుతాయి.
  • ఉపాధ్యాయులు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి గొప్పతనం వివరిస్తూ మరియు భవిష్యత్ తరాలకు అవసరమైన సూచనలు ఇస్తూ, మార్గ నిర్దేశ చెస్తారు.

కాళోజీ నారాయణరావు జయంతి (సెప్టెంబర్ 9)- తెలంగాణా భాషా దినోత్సవం.

  • మా కళాశాలలో కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలు ప్రతి సంవత్సరం ఘనంగా జరుగుతాయి.
  • 2014 సెప్టెంబర్ 9న కాళోజీ నారాయణరావు గారి 100వ పుట్టిన రోజు సంద్భంగా కాళోజీ గారి జయంతిని మన తెలంగాణా భాషా దినోత్సవంగా జరుపుకోవాలని అప్పటి ముఖ్యంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సూచించారు. 2015 సంవత్సరం నుండి తెలంగాణా భాషా దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాము.
  • ఉపాధ్యాయులు మరియు ప్రిన్సిపాల్ గారు కాళోజీ గారి గొప్పతనం వివరించారు.

సావిత్రిబాయి ఫూలే జయంతి (ప్రతి సంవత్సరం జనవరి 3)

  • మా కళాశాలలో సావిత్రిబాయి ఫూలే జయంతి వేడుకలు ప్రతి సంవత్సరం ఘనంగా జరుగుతాయి.
  • సావిత్రిబాయి ఫూలే భారతీయ సంఘ సంస్కర్త, ఉపాధ్యాయిని మరియు గొప్ప రచయిత్ర.
  • ఆమె నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన చేసిన జ్యోతీరావ్ ఫూలే భార్య. కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమస్వరూపిణి.
  • మహిళా హక్కుల కోసం విశేష కృషి చేసిన సావిత్రీబాయి ఫూలే జయంతి సందర్భంగా విద్యార్థులు గొప్పగా ప్రసంగించారు.

బతుకమ్మ వేడుకలు

  • తెలంగాణ ఆడపడుచులంతా రాష్ట్రవ్యాప్తంగా  ఎంతో ఆనందంగా జరుపుకునే సద్దుల బతుకమ్మ వేడుకలు మా కళాశాలలో కూడా జరుపుకుంటాము.
  • ఆనందోత్సాహాలతో  బోధనా మరియు బోధనేతరా సిబ్బంది రంగురంగుల పూలతో బతుకమ్మను అలంకరించి, బతుకమ్మ పాటలతో ఆడుతూ మరియు పాడుతూ తెలుగు సంస్కృతి సంప్రదాయాల్లో భాగంగా గౌరమ్మను (బతుకమ్మ) చెరువులో నిమజ్జనం చేస్తారు.