Departments - TELUGU - Best Practice
Best Practices
TTWRDC (Girls) – ఖమ్మం తెలుగు శాఖ విద్యార్దులకు మంచి విద్యను అందించటానికి ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటుంది. దానికోసం అందుబాటులో ఉన్న అధునాతన పద్దతులను ఉపయోగిస్తున్నాము. విద్యార్దులలో ఉన్న సృజనాత్మకను గుర్తుంచి వారి భవిష్యత్తు అవసరాలుకు అనుగుణంగా వారికి కొత్త కొత్త పద్దతులలో, విభిన్న అంశాలను క్రోడీకరించి బోధించడం జరుగుతుంది.
ICT Classes
- వివిధ అంశాలను సమర్ధవంతంగా అర్థం చేసుకోవడానికి ICT అనేది ఉత్తమమైన పద్ధతి.
- ICT మాధ్యమాన్ని ఉపయోగించి సమర్థవంతమైన బోధన మరియు అభ్యసన జరుగుతుంది.
- ఈ అధునాతన, అంతర్జాల ప్రపంచంలో విద్యార్ధులు అవరోధాలు ఎదుర్కోకుండా ముందుగానే వారికి కావలసిన సాంకేతిక నైపుణ్యాన్ని అలవర్చుకోవచ్చు.
- ICT బోధన పద్దతిని తరగతి గదిలో నిర్వహించడం ద్వారా విద్యార్ధులు ఆసక్తిగా కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటారు.
- ICT బోధనలో భాగంగా విద్యార్ధులు తరగతి గదిలో కంప్యూటరు, చరవణి ఉపయోగించి కొత్త విషయాలు తెలుసుకుంటారు.
- వీడియో రూపంలో చూస్తూ, వింటూ అంశాలను నేర్చుకోవటం వలన వారు ఈ అంశాలను ఎక్కువ కాలం గుర్తుంచుకుంటారు.
- అంశాని సులభంగా అర్థం చేసుకోవటానికి ICT బోధనా ఉపయోగపడుతుంది.
PG Coaching
- తెలుగు శాఖ విద్యార్ధులు ఉన్నత విద్యను ఎల్లపుడూ ప్రోత్సహిస్తుంది.
- PG పరీక్ష కోసం అవసరమైన, సమగ్రమైన, ప్రధాన అంశాలు మరియు సబ్జెక్టు సంబంధించిన అంశాలు బోధించటం జరగుతుంది.
- PG పరీక్ష పరీక్ష విధానం, ప్రశ్నల రకాలు వంటి అంశాలు వివరిస్తాము.
- ప్రవేశ పరీక్షలో కఠినమైన ప్రశ్నలుకు సమాధానాలు ఏ విధంగా గుర్తించాలి అనేది నేర్పిస్తాము.
- పరీక్ష రాసేటప్పుడు సమయ పాలన ఏ విధంగా వుండాలి అనేది నేర్పిస్తాము.
- PG శిక్షణలో భాగంగా విషయ వివరణతో పాటు నోట్స్ ఇవ్వడం జరగుతుంది.
- వారాంతపు పరీక్షలు నిర్వహిస్తాము.
Student Seminars
- తెలుగు శాఖ విద్యార్ధుల జ్ఞానాన్నీ మరియు ఆలోచనల్ని తోటి విద్యార్ధులతో పంచుకోవటాన్ని ఎల్లపుడూ ప్రోత్సహిస్తుంది.
- పదిమంది ముందు మాట్లాటడానికి కొంతమదికి భయంగా ఉండవచ్చు, ఈ సెమినార్ వలన విద్యార్ధులలో భయాన్ని పొగట్టవచ్చు.
- తమ అభిప్రాయలును ఎదుటి వారితో పంచుకోవటం మంచి ఆలోచన, విద్యార్థిదశలోనే మొదలవడం ఒక గొప్ప విషయం.
- తాము చెప్పదలచిన అంశాన్ని పాఠ్యపుస్తకం నుంచి ఎంచుకుంటారు. 2 లేదా 3 రోజులు ఆ అంశాన్ని సాదన చేస్తారు.
- నల్లబల్లపై రాస్తూ సెమినార్ అంశాన్ని వివరిస్తారు.
Student Project Works
- ప్రాజెక్టు ఇవ్వడం వలన విద్యార్ధులలో సృజనాత్మక సామర్ధ్యం పెరగుతుంది.
- ప్రాజెక్టు అనేది ఒక సమూహంగా విద్యార్ధులకు ఇస్తాము. దాని వలన విద్యార్ధులలో స్నేహ భావం అలవడుతుంది.
- బాగా ఆలోచించి మరియు శోధన చేసి ప్రాజెక్టు రాస్తారు కాబట్టి ప్రతి అంశంపై విద్యార్ధులు ఆహావగాహన కలిగి ఉంటారు.
- ప్రాజెక్టు కోసం వివిధ మార్గాల ద్వారా అంశాని సేకరిస్తారు, దానికి గ్రంధాలయం మరియు అంతర్జాలం ఉపయోగిస్తారు.
- విద్యార్ధుల మధ్య అభిప్రాయాలను గౌరవించండం అలవడుతుంది.
Group Discussions
- తరగతి గదిలో ఉన్న విద్యార్ధులను వివధ సమూహాలుగా విభజిస్తాము. ఒక్కో సమూహంకు ఒక్కో అంశం ఇస్తాము.
- ఆ అంశంపై వారు చర్చఇస్తారు. దాని వలన ఒక్కో విద్యార్థి ఆలోచన సరళి తెలుస్తుంది. భిన్న భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతాయి.
- తోటి వారితో స్నేహభావం పెరిగుతుంది.
- సానుకూల వైఖరి, పోటీ తత్వం అలువడుతుంది.
Certificate Courses
- తెలుగు శాఖ వివిధ సర్టిఫికెట్ కోర్సులను నిర్వహిస్తుంది.
- సర్టిఫికెట్ కోర్సును ఆసక్తి ఉన్న విద్యార్ధులు ఎంపిక చేసుకుంటారు.
- వారకి 30రోజులు తరగతులు నిర్వహిస్తాము. దీనికోసం ప్రత్యేకమైన సిలబస్ రూపొందిస్తాము.
- 30 రోజుల తరువాత పరీక్ష నిర్వహించి, అందులో ఉత్తీర్ణులు అయిన వారికి సర్టిఫికెట్ అంధజేస్తాము.
Literary Club
- విద్యార్థులలో ఆత్మవిశ్వాసం మరియు సానుకూల వైఖరి అనేది పెరుగుతుంది.
- వివిధ విషయాల గురుంచి విద్యార్థులకు అవగాహన వస్తుంది
- తోటి విద్యార్థులందరి ముందు మాట్లాడడానికి విద్యార్థులను ప్రేరేపిస్తుంది ఈ Literary క్లబ్.
- మాట్లాడే నైపుణ్యాన్ని, తెలుగు బాషని ధారాళంగా మాట్లాడం వంటివి పెరుగుతాయి.
- తెలుగు శాఖ వారానికి రెండు రోజులు ఈ Literary క్లబ్ లో కార్యక్రమాలు నిర్వహిస్తుంది, అన్ని గ్రూప్ ల వారు పాల్గొన వచ్చు.
- ఈ కార్యక్రమం లో భాగంగా విద్యార్థులకు ముందే ఒక అంశం ఇస్తారు. వారు దానిని సాధన చేసి తోటి విద్యార్థుల ముందు మాట్లాడతారు.
ఈ క్లబ్ లో జరిగే కార్యక్రమాలు
- పాటలు పాడటం, కవితలు రాయటం, సామెతలు, పొడుపు కథలు అడగటం, నీతి కథలు చెప్పడం మొదలుగునవి జరగుతాయి.
- ఈ Literary క్లబ్ కార్యాచరణ వలన విద్యార్థులు అంశం గురుంచి తెలుసుకోవడానికి లైబ్రరి లో ఎక్కువగా పుస్తకాలు చదువుతుంటారు. దీని వలన వారికి పుస్తక జ్ఞానం పెరుగుతుంది.